Speaker: రాజధానిని మార్చుతున్నామని ఎవరు చెప్పారు? సీఎం చెప్పారా?: స్పీకర్ తమ్మినేని

  • ఏపీలో రగులుకుంటున్న రాజధాని వివాదం
  • అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం
  • మంత్రి శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ఉటంకించారంటూ స్పీకర్ సమర్ధన
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం రాజధాని రగడపై స్పందించారు. రాజధానిపై ఇంత చర్చ జరగడం అర్థరహితమని వ్యాఖ్యానించారు. రాజధాని మారుస్తామని చెప్పిందెవరు? సీఎం చెప్పారా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. మంత్రి రాజధాని విషయంలో శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ఉటంకించినంత మాత్రాన ఇంత రాద్ధాంతం చేయడం తగదని హితవు పలికారు. కాగా, గత కొన్నిరోజుల నుంచి రాజధాని అమరావతి విషయంలో అధికార, విపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో వాతావరణం వేడెక్కింది. దీనికితోడు రాజధాని రైతులు తమ ప్రయోజనాలను దెబ్బతీయవద్దంటూ ఆందోళన వ్యక్తం చేస్తుండడంతో రాజధాని మార్పు అంశం తీవ్ర రూపు దాలుస్తోంది.
Speaker
Assembly
Andhra Pradesh
Tammineni
Jagan

More Telugu News