Andhra Pradesh: ఏపీలో ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఫొటో తీసి ఈ నెంబరుకి పంపొచ్చు: మంత్రి పేర్ని నాని

  • ఏపీ రవాణా శాఖ వినూత్న కార్యక్రమం
  • రోడ్డు ప్రమాదాలు, రహదారి భద్రతపై అవగాహన 
  • ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన ఫిర్యాదులకు 9542800800 నెంబర్ కేటాయించాం
ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏపీ రవాణా శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విజయవాడలో మీడియాతో రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు, రహదారి భద్రతపై అవగాహన దిశగా రవాణా శాఖ చర్యలు చేపట్టామని, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన ఫిర్యాదులకు 9542800800 నెంబర్ ను కేటాయించినట్టు వెల్లడించారు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఫొటో తీసి ఈ నెంబరుకి పంపవచ్చని, ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారి ఇంటికే జరిమానా పంపుతామని అన్నారు. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Andhra Pradesh
Minister
Perni Nani
Traffic

More Telugu News