Sensex: బ్యాంకింగ్ షేర్లు బేజారు.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 189 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 59 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 7 శాతం పైగా నష్టపోయిన యస్ బ్యాంక్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. రూ. 1.76 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తామని ఆర్బీఐ ప్రకటించడం బ్యాంకింగ్ షేర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 189 పాయింట్లు పతనమై 37,451కి పడిపోయింది. నిఫ్టీ 59 పాయింట్లు కోల్పోయి 11,046కి జారుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.61%), ఇన్ఫోసిస్ (2.18%), టెక్ మహీంద్రా (2.10%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (0.51%), టీసీఎస్ (0.18%).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-7.47%), వేదాంత లిమిటెడ్ (-4.06%), టాటా స్టీల్ (-4.02%), టాటా మోటార్స్ (-3.28%), ఓఎన్జీసీ (-3.18%). వీటికి తోడు అన్ని బ్యాంకుల షేర్లు నష్టాలనే మూటగట్టుకున్నాయి.

More Telugu News