cm: సీఎం జగన్ ని విమర్శించిన యనమలపై విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు!

  • నాటి ఆర్థికమంత్రి యనమల హయాంలో రాష్ట్రం వెనకబడిపోయింది
  • ఏపీ అభివృద్ధికి జగన్ గండికొడుతున్నారా?
  • మొన్నటి ఎన్నికల్లో ప్రజలు తగిన సమాధానం చెప్పారు
ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా బదులిచ్చారు. గతంలో ఏపీకి ఆర్థికమంత్రిగా పని చేసిన యనమల రాష్ట్రాన్ని ఇరవై ఏళ్లు వెనక్కి నెట్టిన ఘనుడని విమర్శలు చేశారు. తెలంగాణ లబ్ధి కోసం ఏపీ అభివృద్ధికి జగన్ గండికొడుతున్నారన్న యనమల వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. మొన్నటి ఎన్నికలకు ముందు మోదీ, కేసీఆర్ తో తాము చేతులు కలిపామని ఆరోపణలు చేశారని, అందుకే, ప్రజలు తగిన సమాధానం చెప్పారంటూ యనమలపై విమర్శలు చేశారు.
cm
Jagan
Telugudesam
Yanamala
vijayasai
Reddy

More Telugu News