Narendra Modi: నా నిర్ణయానికి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు: ఆమిర్‌ ఖాన్‌కు మోదీ ట్విట్టర్‌ సందేశం

  • ప్లాస్టిక్‌ నిషేధానికి పిలుపునిచ్చిన ప్రధాని
  • అక్టోబర్‌ 2 నుంచి శ్రీకారం చుడదామని పిలుపు
  • దీనికి ట్విట్టర్‌లో మద్దతు తెలిపిన బాలీవుడ్‌ హీరో
ప్రముఖ బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ఖాన్‌కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తన నిర్ణయాన్ని సమర్ధించినందుకు ధన్యవాదాలంటూ ట్వీట్‌ చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్‌ వస్తువుల వాడకాన్ని నిలిపి వేయాలని, ఈ సత్సంకల్పానికి అక్టోబర్‌ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రధాని మోదీ ఇటీవల తన ఆల్‌ ఇండియా రేడియో ప్రసంగం మన్‌ కీ బాత్‌లో పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.  ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు మద్దతుగా నిలిచారు. ' మీ నిర్ణయం చాలా గొప్పది. దాన్ని స్వాగతిస్తున్నా. ఒకసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తప్పకుండా ఆపేస్తాం' అని ఆమిర్‌ ఖాన్ ట్విటర్‌ ద్వారా మోదీకి మద్దతు తెలిపారు. దీనికి ధన్యవాదాలు తెలియజేస్తూ మోదీ  ట్వీట్‌ చేశారు.
Narendra Modi
amir khan
Twitter
plastic usage

More Telugu News