Kuna Ravikumar: పోలీసులకు చిక్కకుండా పారిపోయిన టీడీపీ నేత కూన రవికుమార్... ప్రత్యేక టీమ్ ల ఏర్పాటు!

  • ఎంపీడీఓను దుర్భాషలాడిన కూన
  • పలు సెక్షన్ల కింద కేసు నమోదు
  • ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు
శ్రీకాకుళం జిల్లా నరబుజ్జిలి ఎంపీడీఓ, అధికారులను దుర్భాషలాడిన తెలుగుదేశం నేత, మాజీ విప్ కూన రవికుమార్ ను అరెస్ట్ చేయాలని పోలీసులు ప్రయత్నిస్తుండగా, ఆయన ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి నెలకొంది. కూన రవికుమార్‌ పై ఎంపీడీఓ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఎంపీడీఓను బెదిరించిన కేసులో కూన సహా మరో 11 మందిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 353, 427, 506, 143, సెక్షన్‌ (3) పీడీపీపీ యాక్ట్‌ 1984ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

ప్రత్యేక పోలీసుల టీమ్ వీరిని అరెస్ట్ చేసేందుకు ఆముదాలవలసకు రాగా, మొత్తం నిందితులందరూ పరారీలో ఉన్నారని అధికారులు వెల్లడించారు. కాగా, కూన రవికుమార్, ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మిగతా నిందితుల కుటుంబ సభ్యులను ప్రస్తుతం విచారిస్తున్న పోలీసులు, వారి ఆచూకీ తెలుసుకునేందుకు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు.
Kuna Ravikumar
Andhra Pradesh
Srikakulam District
MPDO
Police
Case

More Telugu News