Somireddy: మాజీమంత్రి సోమిరెడ్డిపై వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

  • భూమికి సంబంధించి దొంగ పత్రాలు సృష్టించారంటూ అభియోగాలు
  • కోర్టును ఆశ్రయించిన భూమి అసలు యజమాని
  • సోమిరెడ్డిని ఏ1గా పేర్కొంటూ కేసు నమోదు
  • మరికొందరు వ్యక్తులపైనా కేసు
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు సోమిరెడ్డిని ఏ1గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఇడిమేపల్లిలో 2.4 ఎకరాలకు సంబంధించి దొంగ పత్రాలు సృష్టించారంటూ సోమిరెడ్డిపై అభియోగాలు దాఖలు చేశారు. ఈ భూమిని కొన్న మేఘనాథ్, జయంతి, సుబ్బారాయుడు అనే వ్యక్తులపైనా కేసు నమోదైంది. భూమి అసలు యజమాని కోర్టును ఆశ్రయించడంతో సోమిరెడ్డి తదితరులపై కేసులు నమోదయ్యాయి.
Somireddy
Venkatachalam
Police

More Telugu News