Nara Lokesh: పవర్ లిఫ్టర్ చంద్రికకు పూర్తి భరోసా ఇచ్చిన నారా లోకేశ్

  • నారా లోకేశ్ ను కలిసిన పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి చంద్రిక
  • ఎన్నారైలు సేకరించిన విరాళాన్ని చంద్రికకు అందించిన లోకేశ్
  • పార్టీ నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని వెల్లడి
మంగళగిరికి చెందిన వర్ధమాన పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి చంద్రికకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేయూతనందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఎన్నారై టీడీపీ, యూకే టీడీపీ బృందాలు సేకరించిన రూ.2.5 లక్షల మొత్తానికి సంబంధించిన చెక్ ను నారా లోకేశ్ పవర్ లిఫ్టర్ చంద్రికకు తన చేతుల మీదుగా అందించారు. త్వరలో కెనడాలో జరిగే పోటీలకు మాత్రమే కాకుండా, మున్ముందు ప్రపంచస్థాయిలో చంద్రిక పాల్గొనే అన్ని పోటీలకు అవసరమైన శిక్షణ, ఇతర ఏర్పాట్లకు పార్టీ నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని లోకేశ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
Nara Lokesh
Chandrika
Power Lifting

More Telugu News