Amaravathi: అలా నిరూపిస్తే నా భూమి మొత్తాన్ని మీకు రాసిచ్చేస్తా!: బొత్సకు అమరావతి మహిళ సవాల్

  • వరదలకు అమరావతి ప్రాంతం మునిగిందని నిరూపించగలరా?
  • పుట్టింటి వాళ్లిచ్చిన మూడున్నర ఎకరాల భూమి రాసిచ్చేస్తా  
  • రాజధానిని తరలించాలని కుట్ర చేస్తున్నారు
ఇటీవల సంభవించిన వరదలకు అమరావతిలోని పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయని... ఈ ప్రాంతం  రాజధానికి అనువైనది కాదంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతానికి చెందిన ఓ మహిళ బొత్సకు సవాల్ విసిరారు. వరదలకు అమరావతి ప్రాంతం మునిగిందని నిరూపించగలరా? అంటూ ఛాలెంజ్ చేశారు.

రాజధాని మునుగుతుందని నిరూపిస్తే... తన పుట్టింటివాళ్లు తనకిచ్చిన మూడున్నర ఎకరాల భూమిని బొత్సకు రాసిచ్చేస్తానని తెలిపారు. అమరావతి రాజధానికి అనుకూలం కాదనే విషయాన్ని మొదట్లోనే బొత్స ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. రాజధానిని ఇక్కడి నుంచి తరలించాలనే కుట్రతోనే ఇవన్నీ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
Amaravathi
Woman
Challenge
Botsa Satyanarayana
YSRCP

More Telugu News