Yanamala: తెరముందు మంత్రి బొత్స...తెరవెనుక జగన్‌: రాజధాని అంశంపై యనమల ఘాటు వ్యాఖ్యలు

  • సీఎం ఆదేశాలతోనే మంత్రి అలా మాట్లాడుతున్నారు
  • ఏపీకి చంద్రబాబు ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చారు
  • దాన్ని నాశనం చేయాలని ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారు
రాజధాని అమరావతి విషయంలో తెరముందుకు వచ్చి మాట్లాడుతున్నది మంత్రి బొత్స సత్యనారాయణే అయినా వెనుక నుంచి మాట్లాడిస్తున్నది ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే ప్రభుత్వ ఉద్దేశాన్ని మంత్రి వెల్లడిస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తే దాన్ని నాశనం చేయడానికి జగన్‌ కంకణం కట్టుకున్నారని ఘాటుగా విమర్శించారు. వైసీపీ నాయకుల తీరు చూస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం కనిపించడం లేదన్నారు. ఏపీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి హైదరాబాద్‌ను ఆర్థికంగా పెంచడమే ముఖ్యమంత్రి జగన్‌ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో సాయపడిన టీఆర్‌ఎస్‌ రుణం తీర్చుకునే ఉద్దేశం ఇది అని ఆరోపించారు.
Yanamala
ap rajadhani
jagan
Botsa Satyanarayana
TRS

More Telugu News