Kurnool District: కర్నూలు జిల్లాలో కూలీలకు దొరికిన వజ్రాలు... ఎగరేసుకుపోయిన వ్యాపారులు!

  • వర్షాలు పడితే బయటకు వచ్చే వజ్రాలు
  • ఇద్దరు కూలీలకు దొరికిన రెండు
  • రూ. 3 లక్షలకు కొన్న వ్యాపారులు
వర్షాలు పడుతున్న వేళ, కర్నూలు జిల్లాలోని తుగ్గలి, ప్యాపిలీ, గుత్తి తదితర మండలాల్లోని పొలాల్లో వజ్రాలు లభిస్తాయన్న సంగతి తెలిసిందే. వీటి కోసం ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చి, వేట సాగిస్తుంటారు. తాజాగా, జొన్నగిరి పొలాల్లో వ్యవసాయ పనులు చేస్తున్న ఇద్దరు కూలీలకు రెండు వజ్రాలు లభించాయని తెలుస్తోంది.

ఆ సమీపంలోనే బస చేసి, దొరికిన వజ్రాలను కొనుగోలు చేసే వ్యాపారులకు విషయం తెలియగా, వారు హుటాహుటిన వచ్చి, వాటిని పరిశీలించి, కాస్తంత నాణ్యత తక్కువైన వజ్రాలని నిర్ణయించి, రూ. 3 లక్షలకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ సంవత్సరం దాదాపు పది మంది వరకూ వజ్రాలను సొంతం చేసుకున్నారని ఈ ప్రాంత వాసులు అంటున్నారు.
Kurnool District
Diamonds
Rains

More Telugu News