Bigg Boss: బిగ్ బాస్-3... 6వ వారంలో ఎలిమినేషన్ కు నామినేట్ అయింది వీరే!

  • కాస్తంత వెరైటీగా నామినేషన్ ప్రక్రియ
  • వరుణ్ ను డైరెక్ట్ గా నామినేట్ చేసిన శివజ్యోతి
  • ఆరుగురి మెడపై ఎలిమినేషన్ కత్తి
టాలీవుడ్ అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ ఆరవ వారంలోకి వచ్చింది. ఈ వారంలోనూ ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి వుండగా, నామినేషన్ ప్రక్రియ కాస్తంత వెరైటీగా జరిగింది. కెప్టెన్‌ శివజ్యోతి మినహా మిగతా 10 మందిని ఇద్దరేసి చొప్పున 5 గ్రూపులుగా విభజించిన బిగ్ బాస్, ఇద్దరిద్దరిని నామినేట్ చేయవలసిందిగా ఆదేశించాడు. ఇక వీరి నుంచి మహేశ్ పేరు అత్యధికంగా వినిపించింది. ఆపై హిమజ, మహేశ్, రవి, రాహుల్, పునర్నవిలు నామినేట్ అయ్యారు. మిగిలిన ఐదుగురిలో ఒకరిని డైరెక్ట్‌ గా ఎలిమినేషన్ కు నామినేట్ చేయాలని శివజ్యోతిని బిగ్ బాస్ కోరగా, ఆమె వరుణ్ ను నామినేట్ చేసింది. ఇక, ఈ నాలుగు రోజుల తరువాత ఆదివారం నాడు వీరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు.
Bigg Boss
Season 3
Tollywood
Nominations

More Telugu News