Jagan: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ... వివిధ అంశాలపై చర్చ

  • ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం
  • అమిత్ షాతో గంటకు పైగా భేటీ
  • వివిధ అంశాలపై చర్చ
ఏపీ సీఎం జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఇవాళ ఢిల్లీ వెళ్లిన జగన్ సాయంత్రం అక్బర్ రోడ్డులోని అమిత్ షా నివాసానికి వెళ్లారు. దాదాపు గంటసేపు ఆయనతో చర్చించారు. కొద్దిసేపటి క్రితమే ఇరువురి భేటీ ముగిసింది. రాష్ట్ర విభజన సమస్యలు, హామీలు, కేంద్రం నుంచి ఏపీకి అందాల్సిన నిధుల విషయమై జగన్ ఈ సందర్భంగా అమిత్ షాతో చర్చించారు. అంతకుముందు ఆయన, నక్సలిజంపై కేంద్ర హోం శాఖ నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు.
Jagan
Amit Shah

More Telugu News