Varun Tej: 'వాల్మీకి' నుంచి పూజా హెగ్డే లుక్

  • హరీశ్ శంకర్ రూపొందించిన 'వాల్మీకి'
  • పల్లెటూరి అమ్మాయి పాత్రలో పూజా హెగ్డే 
  • వచ్చేనెల 13వ తేదీన విడుదల     
హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'వాల్మీకి' సినిమా రూపొందింది. వరుణ్ తేజ్ - అధర్వ మురళి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, కథానాయికగా పూజా హెగ్డే కనిపించనుంది. ఈ సినిమా నుంచి వరుణ్ తేజ్ లుక్ బయటికి రావడంతో, అందరిలో మరింతగా ఆసక్తి పెరిగింది.

ఈ సినిమాలో పూజా హెగ్డే 'దేవి' పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఆమె లుక్ ను వదిలారు. 1990ల నాటి పల్లెటూరి అమ్మాయి వేషధారణలో, ఓణీ .. రెండు జడలతో ఆమె కనిపిస్తోంది. కూరగాయలు తీసుకురావడానికి అన్నట్టుగా సంచీ తీసుకుని ఆమె సైకిల్ పై వెళుతోన్న లుక్ ఆకట్టుకుంటోంది. మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, వచ్చేనెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
Varun Tej
Pooja Hegde

More Telugu News