B.K.Eeshwar: అదే కృష్ణగారి గొప్పతనం: సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్

షార్ట్స్‌లో చూడండి
సీనియర్ జర్నలిస్ట్ గా బీకే ఈశ్వర్ కి మంచి పేరు వుంది. ఎంతోమంది నటీనటుల కెరియర్ ను చాలా దగ్గరగా చూస్తూ వచ్చిన వారాయన. తాజాగా ఆయన మాట్లాడుతూ, హీరో కృష్ణ గురించి ప్రస్తావించారు. "కృష్ణగారు ముక్కుసూటి మనిషి .. ఉన్నదున్నట్టుగా మాట్లాడటం ఆయనకి అలవాటు. ఒకసారి ఒక నిర్మాత ఆయనతో పనుండి వచ్చాడు. ఆ సమయంలో విడుదలైన కృష్ణగారి సినిమాను గురించి గొప్పగా మాట్లాడాడు.

అప్పుడు కృష్ణగారు నవ్వేసి .. "చాల్లే ఊర్కోండి .. ఆ సినిమా పరాజయంపాలైంది' అంటూ అది ఏ ఏరియాలో ఎంత వసూలు చేసిందో చెప్పారు. ఇక మరోసారి మరో నిర్మాత వచ్చి, తమ కాంబినేషన్లో తాజాగా విడుదలైన సినిమా ఫ్లాప్ అయిందని అన్నారు. అలాంటప్పుడు కొంతమంది కథానాయకులు, తమకి రావలసిన మిగతా డబ్బు గురించి అడుగుతారు. కానీ కృష్ణగారు 'నాకు ఇవ్వాల్సిన మిగతా డబ్బు గురించి కంగారు పడకండి .. డేట్స్ ఇస్తాను .. నాతో మరో సినిమా తీయండి .. ఈ సారి హిట్ కొడదాం' అనడం ఆయనకే చెల్లింది" అంటూ చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
B.K.Eeshwar
krishna

More Telugu News