TG Venkatesh: రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ జెండా ఎగరబోతోంది: టీజీ వెంకటేశ్

  • తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతోంది
  • గూండాలు, రౌడీలు, ఫ్యాక్షనిస్టులు రాజకీయాల్లో ఉంటే ప్రజలకు మేలు జరగదు
  • ప్రజలకు సేవ చేయడం బీజేపీ రక్తంలోనే ఉంది
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతోందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ జెండా ఎగురుతుందని జోస్యం చెప్పారు. గూండాలు, రౌడీలు, ఫ్యాక్షనిస్టులు రాజకీయాల్లో ఉంటే ప్రజలకు మేలు జరగదని అన్నారు. ప్రజలకు సేవ చేయడమనేది బీజేపీ రక్తంలోనే ఉందని వ్యాఖ్యానించారు.

ఏపీలో నాలుగు ప్రణాళిక బోర్డులను తయారు చేస్తున్నారని... అందుకే రాష్ట్రానికి నాలుగు రాజధానులను కూడా ఏర్పాటు చేస్తారని తాను అనుకుంటున్నానని చెప్పారు. రాష్ట్ర బీజేపీ నేతలతో జగన్ ఎప్పుడూ మాట్లాడలేదని, కేంద్ర నాయకులతోనే ఆయన మాట్లాడతారని, వారితో జగన్ చర్చించిన మాటలనే తాను చెప్పానని అన్నారు.
TG Venkatesh
BJP
Jagan

More Telugu News