Sruthi Hariharan: 'మీటూ' కేసులో సినీనటి శ్రుతి హరిహరణ్ కు షాక్

  • అర్జున్ తనను అసభ్యంగా తాకారంటూ శ్రుతి ఆరోపణలు
  • శ్రుతిపై పరువు నష్టం దావా వేసిన అర్జున్ పిల్లలు
  • శ్రుతి పిటిషన్ ను కొట్టేసిన కోర్టు
ప్రముఖ సినీ నటుడు అర్జున్ పై 'మీటూ' ఉద్యమం నడుస్తున్న సమయంలో లైంగిక వేధింపుల ఆరోపణలు గుప్పించిన హీరోయిన్ శ్రుతి హరిహరణ్ పతాక శీర్షికల్లో ఎక్కిన సంగతి తెలిసిందే. షూటింగ్ సందర్భంగా ఓ సన్నివేశాన్ని ఎలా చేయాలో వివరిస్తూ, తనను అసభ్యంగా తాకారని ఆమె ఆరోపించింది. అప్పట్లో ఆమె పోలీసులకు కూడా అర్జున్ పై ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో చిత్ర పరిశ్రమ చేసిన ప్రయత్నాలకు కూడా ఆమె తలొగ్గలేదు. అనంతరం ఆమెపై అర్జున్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు కేసులు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నాయి.

మరోవైపు, తన తండ్రి పరువుకు శ్రుతి భంగం కలిగించిందంటూ అర్జున్ పిల్లలు ఆమెపై రూ. 5 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. అయితే, అర్జున్ పిల్లలు తనపై వేసిన కేసు చెల్లదంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్ ను విచారించిన కోర్టు ఆమెకు షాక్ ఇచ్చింది. పిటిషన్ చెల్లదంటూ కొట్టివేసింది.
Sruthi Hariharan
Arjun MeeToo
Court

More Telugu News