Chittoor District: ఎటువంటి ఆందోళన వద్దు...శ్రీవారి దర్శనానికి నిర్భయంగా రండి : ఎస్పీ అన్బురాజన్‌

  • పటిష్ట భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి
  • ఎటువంటి ఉగ్రహెచ్చరికలు లేవు 
  • సాధారణ తనిఖీలే చేపడుతున్నామన్న ఎస్పీ
పటిష్ట భద్రతా ఏర్పాట్లు ఉన్న పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణమని, భక్తులు ఎటువంటి ఆందోళన చెందకుండా నిర్భయంగా స్వామి వారి దర్శనానికి తరలిరావాలని చిత్తూరు జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ స్పష్టం చేశారు. తమిళనాడులో ఉగ్రవాదులు  ప్రవేశించారన్న వార్తల నేపథ్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తిరుపతి, తిరుమలకు ఎలాంటి ఉగ్ర హెచ్చరికలు  లేవని, భక్తులు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని చెప్పారు. ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలున్నాయని, సాధారణ తనిఖీలు  మాత్రం కొనసాగిస్తున్నామని తెలిపారు. కొన్నిచోట్ల కెమెరాలు పనిచేయడం లేదని సమాచారం ఉందని, కొత్త కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు లేఖ రాశామని ఎస్పీ తెలిపారు.
Chittoor District
tirupathi
Tirumala
sp
terrorist activities

More Telugu News