Amaravati: రాజధానిని తరలిస్తే ఆత్మహత్యలు.. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన రైతులు

  • గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంలో ఆందోళన
  • మంత్రి బొత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు
  • కిలోమీటరు మేర నిలిచిపోయిన వాహనాలు
రాజధాని అమరావతిని మారుస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈరోజు ఉదయం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

 అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే సహించేది లేదని, ప్రభుత్వం తీవ్ర నిర్ణయం తీసుకుంటే ఆత్మహత్యలకు కూడా వెనుకాడమని హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధుల వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల ఆందోళనతో సచివాలయానికి వెళ్లే దారిలో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి.
Amaravati
Guntur District
mangalagiri
krishnayapalem

More Telugu News