Sahoo: ప్రభాస్ నా క్యాస్ట్... అందుకే ఈ 'క్యాస్ట్ ఫీలింగ్': రామ్ గోపాల్ వర్మ!

  • మరో నాలుగు రోజుల్లో 'సాహో'
  • ప్రభాస్ కులాన్ని ప్రస్తావించిన వర్మ
  • తనదీ అదే కులమంటూ ట్విట్టర్ పోస్ట్
తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మిగతా దర్శకులతో పోలిస్తే, ఓ మెట్టు పైనే ఉంటారు. తాను నూతనంగా నిర్మిస్తున్న 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా విషయంలోనూ ఆయన తనదైన దారిలోనే నడుస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో ప్రభాస్ నటించిన 'సాహో' విడుదలకు సిద్ధం కానుండగా, ప్రభాస్ కులాన్ని ప్రస్తావిస్తూ, వర్మ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. తన కొత్త సినిమాలోని పాటను ఎల్లుండి ఉదయం విడుదల చేయనున్నట్టు చెప్పాడు.

"నాకు చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. అందుకనే రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా కోసం కళ్లు వాచిపోయేలా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ప్రభాస్ నా క్యాస్ట్ కాబట్టి. ఈ సందర్భంగా నా నెక్ట్స్ సినిమా కమ్మ రాజ్యంలో కడప రెడ్లులోని ఒక పాటను, 27వ తారీఖు ఉదయం 9గం.27 నిమిషాలకు బ్రహ్మ ముహూర్తంలో రిలీజ్ చేయబోతున్నాం" అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
Sahoo
Ramgopal Varma
Caste Feeling
New Song
Kamma Rajyamlo Kadapa Redlu

More Telugu News