PV Sindhu: శభాష్ సింధూ... తెలుగుతేజంపై ప్రశంసల వర్షం కురిపించిన సీఎం జగన్, నారా లోకేశ్

  • వరల్డ్ బ్యాడ్మింటన్ టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించిన పీవీ సింధు
  • సిసలైన చాంపియన్ లా ఆడావంటూ అభినందనలు
  • మ్యాచ్ ఆరంభం నుంచి చివరివరకు ఆధిపత్యం చూపావని ప్రశంసలు
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఏ ఇతర భారత షట్లర్ కు సాధ్యం కాని రీతిలో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ టైటిల్ నెగ్గడం పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది. చారిత్రాత్మక విజయం అంటూ ఏపీ సీఎం జగన్ అభినందించారు.

"సింధూ శుభాభినందనలు. వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో పసిడి పతకం నెగ్గిన తొలి భారత షట్లర్ గా అవతరించింనందుకు కంగ్రాట్స్. ఫైనల్ మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యం చెలాయించడమే కాకుండా, సిసలైన చాంపియన్ లా మ్యాచ్ ను ముగించావు" అంటూ జగన్ ట్వీట్ చేశారు.

ఇక, టీడీపీ యువనేత నారా లోకేశ్ కూడా పీవీ సింధు ఘనత పట్ల స్పందించారు. పీవీ సింధు నువ్వు తిరుగులేని విజేతవు అంటూ ట్వీట్ చేశారు. "ఫైనల్లో నజోమీ ఒకుహరపై విజయం సాధించినందుకు శుభాభినందనలు. ప్రత్యర్థిపై తిరుగులేని ఆధిపత్యం చూపించావు. నిజంగా గర్విస్తున్నాం సింధూ" అంటూ అభినందించారు.
PV Sindhu
Jagan
Nara Lokesh
BWF

More Telugu News