prakasham barriage: ఎట్టకేలకు ప్రకాశం బ్యారేజీ గేటులో చిక్కుకున్న బోటు తొలగించారు
- పడవకు రంద్రాలు చేసి ఇనుపతాడుతో బయటకు
- నిపుణులను రప్పించిన అధికారులు
- పడవ తొలగించడంతో గేటు మూసివేతకు మార్గం సుగమం
ప్రకాశం బ్యారేజీ గేటులో చిక్కుకున్న పడవను ఎట్టకేలకు అధికారులు అతి కష్టం మీద తొలగించారు. గడచిన ఐదు రోజులుగా శ్రమించిన నిపుణుల బృందం ఎట్టకేలకు ఫలితం సాధించింది. కాకినాడ, బళ్లారి, పులిచింతల, బైరవానితిప్ప నుంచి ఇందుకోసం నిపుణుల బృందాలను రప్పించారు. పడవకు రంద్రాలు చేసి ఇనుపతాడు సాయంతో బయటకు తీశారు.
కృష్ణానది వరద సమయంలో ప్రకాశం బ్యారేజీ గేటు వద్ద పడవ చిక్కుకున్న సంగతి తెలిసిందే. వరద ఉద్ధృతి తగ్గిన తర్వాత అన్ని గేట్లను మూసివేసినా పడవ అడ్డుగా ఉండటంతో ఈ గేటును మాత్రం మూసివేయడం కుదరలేదు. గత కొన్ని రోజులుగా ఆ పడవను తొలగించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పెద్ద మొత్తంలో నీరు వృథాగా కిందికి పోయింది. తాజాగా పడవను అక్కడి నుంచి తొలగించడంతో గేటు మూసేందుకు అధికారులకు మార్గం సుగమమైంది.