TGvenkatesh: నవ్యాంధ్రకు నాలుగు రాజధానులు ఉండబోతున్నాయి ! : ఎంపీ టి.జి.వెంకటేష్‌

  • ఈ అంశంపై బీజేపీ అధిష్ఠానంతో సీఎం జగన్‌ చర్చించారు
  • ఈ విషయం అధిష్ఠానమే నాకు చెప్పింది
  • పరిశీలనలో విజయనగరం, కాకినాడ, కడప, గుంటూరు
నవ్యాంధ్ర రాజధానిపై రాజ్యసభ సభ్యుడు, టీడీపీ నుంచి బీజేపీలోకి వలస వెళ్లిన టి.జి.వెంకటేష్‌ బాంబ్‌ పేల్చారు. అమరావతిపై ఆశలు వదుకోవాల్సిందేనని, ప్రత్యామ్నాయ రాజధానులపై ఇప్పటికే ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి బీజేపీ అధిష్ఠానంతో చర్చించారని చెప్పారు.

ఓ చానెల్‌ ప్రతినిధితో మాట్లాడుతూ రాష్ట్రంలోని విజయనగరం, గుంటూరు, కాకినాడ, కడప జిల్లాలను రాజధానులుగా ప్రొజెక్టు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ విషయం బీజేపీ అధిష్ఠానమే తనకు తెలియజేసిందన్నారు. అధికార పార్టీ యోచన బట్టి నవ్యాంధ్రకు ఒకటి కాకుండా నాలుగు రాజధానులు ఉండే అవకాశం ఉందన్నారు.

పోలవరం టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదన్నారు. పోలవరాన్ని జగన్ నిర్లక్ష్యం చేస్తే చంద్రబాబుకు రాజకీయంగా లైఫ్ ఇచ్చిన వారవుతారని అభిప్రాయపడ్డారు.  కేసీఆర్‌ను జగన్ ఎంత తక్కువగా నమ్మితే ఆయన రాజకీయ జీవితానికి అంత మంచిదని టీజీ హితవు పలికారు.
TGvenkatesh
amaravathi
vijayanagaram
cudupha
guntur
kakinada

More Telugu News