cabinet expnsion: ఒకరికా...ఇద్దరికా : హరీష్‌, కేటీఆర్‌లకు మంత్రి వర్గంలో చాన్స్‌పై ఊహాగానాలు

  • కేబినెట్‌ పదవులు దక్కుతాయన్న ఊహాగానాలు
  • దసరా నాటికి విస్తరణకు అవకాశం
  • ఇప్పటికే లాబీయింగ్‌లో పలువురు నేతలు
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ప్రస్తుతం ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. దసరా నాటికి మంత్రి వర్గ విస్తరణ జరగనుందన్న ఊహాగానాల నేపథ్యంలో ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్‌, మేనల్లుడు హరీష్‌రావు విషయంలో పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన హరీష్ రావు, కేటీఆర్, జోగురామన్న, లక్ష్మారెడ్డి తరుతరులకు కేబినెట్ పదవులు దక్కలేదు. దీంతో ఇప్పుడు ఊహాగానాలు మొదలయ్యాయి.

కేసీఆర్‌ కొడుకు, మేనల్లుడు ఇద్దరికీ మంత్రి వర్గంలో అవకాశం కల్పిస్తారా?, ఎవరో ఒకరికే ఛాన్స్‌ ఇస్తారా? అన్న దానిపై చర్చ సాగుతోంది. నామినేటెడ్, కేబినెట్ పదవుల కోసం చాలామంది నేతలు లాబీయింగ్ జరుపుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఎంపీ వినోద్ కు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి లభించింది. వీరికి విస్తరణలో పదవులు లభించే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం.
cabinet expnsion
Harish Rao
KTR

More Telugu News