‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’లో నేను హిందీలో మాట్లాడినా బేర్ గ్రిల్స్ ఎలా అర్థం చేసుకోగలిగాడో తెలుసా?: ప్రధాని మోదీ క్లారిటీ
- మోదీ-గ్రిల్స్ సాహసాలు
- వీక్షించిన కోట్లాది మంది
- టెక్నాలజీ దూరాన్ని చెరిపేసిందన్న మోదీ
తామిద్దరి భాషల మధ్య దూరాన్ని టెక్నాలజీ చెరిపేసిందని ప్రధాని తెలిపారు. బేర్ గ్రిల్స్ కు ఓ కార్డ్ లెస్ ట్రాన్స్ లేటర్ పరికరాన్ని ఇచ్చామని మోదీ వెల్లడించారు. దీన్ని గ్రిల్స్ చెవికి అమర్చుకున్నారని చెప్పారు. ఈ పరికరం హిందీలో చెప్పే మాటలను వెంటనే ఇంగ్లీష్ లోకి తర్జుమా చేస్తుందని పేర్కొన్నారు. ఇలా తామిద్దరం మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని పేర్కొన్నారు.