Andhra Pradesh: ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు.. జైట్లీ పార్థివ దేహానికి నివాళి!

  • పులమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన నేత
  • నివాళులు అర్పించిన గల్లా, కేశినేని, కనకమేడల
  • ఈ నెల 9న ఎయిమ్స్ లో చేరిన జైట్లీ
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని కైలాష్ నగర్ లో జైట్లీ ఇంటికెళ్లిన చంద్రబాబు.. ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. గతేడాది జైట్లీ ఆరోగ్యం క్షీణించగా, వైద్య పరీక్షల్లో ఆయనకు అరుదైన కేన్సర్ వ్యాధి ఉన్నట్లు తేలింది. దీంతో ఆయన అమెరికాలో చికిత్స తీసుకున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు.

ఈ క్రమంలో ఈ నెల 9న ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన జైట్లీ.. నిన్న మధ్యాహ్నం 12.07 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. కాగా, ఈరోజు చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు గల్లా జయదేవ్‌, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌, కంభంపాటి రామ్మోహన్‌రావు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ జైట్లీకి నివాళి అర్పించారు. మరోవైపు జైట్లీ పార్థివదేహాన్ని ప్రస్తుతం ఆయన ఇంటి నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఊరేగింపుగా తీసుకెళుతున్నారు.
Andhra Pradesh
New Delhi
Arun Jaitly
dead
condolenses

More Telugu News