hariyana: తెగిపడిన కాళ్లనే తలదిండులా ఉపయోగించారు : ఫరీదాబాద్‌లో ఆసుపత్రి సిబ్బంది అమానవీయం

  • పట్టాలు దాటుతుండగా ఢీకొట్టిన రైలు
  • ప్రమాదంలో రెండు కాళ్లు పోగొట్టుకున్న బాధితుడు
  • బాధతో ఆసుపత్రికి వస్తే సిబ్బంది నిర్వాకమిది
మానవత్వం ఉన్న ఎటువంటి మనిషినైనా కదిలించే సంఘటన ఇది. రైలు ఢీకొట్టిన ప్రమాదంలో రెండు కాళ్లు తెగి బాధతో విలవిల్లాడుతూ ఆసుపత్రికి వచ్చిన బాధితుడి తలకింద అతని కాళ్లే దిండులా పెట్టి అమానుషంగా వ్యహరించారు ఆసుపత్రి సిబ్బంది. వివరాల్లోకి వెళితే...హరియాణా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన ప్రదీప్‌ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే అతను తన కార్యాయానికి వెళ్తూ రైలు పట్టాలు దాటుతున్నాడు. అదే సమయంలో వస్తున్నరైలును అతను గమనించక పోవడంతో ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ప్రదీప్‌ రెండు  కాళ్లు తెగిపోయి దూరంగా పడ్డాయి.  స్థానికులు అతన్ని, తెగిన అతని కాళ్లతోపాటు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతటి కష్టంలో బాధతో విలవిల్లాడిపోతున్న ప్రదీప్‌ పట్ల మానవత్వం చూపాల్సిన వైద్య సిబ్బంది ఇలా వ్యవహరించి విమర్శలపాయ్యారు.
hariyana
faridabad
rail accident
hospital staff

More Telugu News