జగజ్జేత ఒకుహరాతో నేడు పీవీ సింధు పసిడిపోరు!
- 2017లో ఒకూహరా చేతిలో ఓటమి
- ఈ దఫా ప్రతీకారం తీర్చుకునే చాన్స్
- నేడు మధ్యాహ్నం గం3.30కి మ్యాచ్
ప్రతిష్ఠాత్మకమైన ఈ టోర్నీ సెమీస్ శనివారం నాడు జరుగగా, ఐదో ర్యాంకర్ గా బరిలోకి దిగిన సింధు 40 నిమిషాల్లోనే 21-7, 21-14 తేడాతో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్, చైనాకు చెందిన యుఫెపై ఘన విజయం సాధించింది.
ఇక ఫైనల్ లో సింధు, ఒకుహరాను ఎదుర్కోవాల్సి వుంది. 2017 ఫైనల్ లో ఒకుహరా చేతిలో ఇదే పోటీలో పోరాడి ఓడిన సింధు, ఈ దఫా ఆమెపై గెలవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ముఖాముఖి రికార్డులో ఒకుహరాపై 8–7తో ఆధిక్యంలో సింధు ఉంది. ఈ ఫైనల్ మ్యాచ్ నేటి మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుండగా, స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.