Bigg boss: బిగ్ బాస్-2... నేడు హౌస్ నుంచి బయటకు వచ్చేది అషూ రెడ్డి!

  • మహేశ్, శివజ్యోతిలు సేఫ్
  • ప్రకటించిన నాగార్జున
  • ఎలిమినేట్ అయింది అషూ అంటూ ప్రచారం
టాలీవుడ్ లో అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ ఐదోవారం ముగిసింది. నేడు హౌస్ నుంచి ఎవరో ఒకరు బయటకు రావాల్సిన సమయం ఆసన్నం కాగా, ప్రతివారం మాదిరే ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరన్న విషయం ముందే లీక్ అయిపోయింది. ఈ వారంలో అషూ రెడ్డి బయటకు రానుందని సమాచారం. నిన్నటి ఎపిసోడ్ లో మహేశ్, శివజ్యోతిలు సేవ్ అయినట్టు నాగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆపై అషూ రెడ్డి ఎలిమినేట్ అయిందని సోషల్ మీడియాలో న్యూస్ వచ్చింది.

నాగ్ పాల్గొనే ఎపిసోడ్ లను ముందుగానే చిత్రీకరిస్తుండగా, ఆడియన్స్ గా పాల్గొనే వారు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారన్న సంగతిని ముందే బయటకు చెప్పేస్తున్నారు. ఇక అఫీషియల్ గా అషూ రెడ్డి ఎలిమినేట్ అయిందా? లేదా? అన్న సంగతి తెలియాలంటే రాత్రి వరకూ ఆగాల్సిందే.
Bigg boss
Ashu Reddy
Eliminate

More Telugu News