west indies: 45 బంతులాడి డకౌట్ అయిన విండీస్ ఆటగాడు!

  • అత్యధిక బంతులు ఆడి డకౌట్ అయిన ఆటగాడిగా చెత్త రికార్డు
  • భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఘటన
  • కె.అర్ధర్‌టన్‌పై ఉన్న చెత్త రికార్డు బద్దలు
భారత్‌తో ఆంటిగ్వాలో జరుగుతున్న తొలి టెస్టులో విండీస్ టెయిలెండర్ ఆటగాడు మిగెల్ కమిన్స్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో శనివారం పదో నంబరు ఆటగాడిగా క్రీజులోకి వచ్చిన మిగెల్ 45 బంతులు ఆడి ఒక్క పరుగు కూడా తీయకుండా అవుటయ్యాడు. ఫలితంగా అత్యధిక బంతులు ఆడి డకౌట్ అయిన విండీస్ క్రికెటర్లలో మొదటి వాడిగా మిగెల్ తన పేరును లిఖించుకున్నాడు.

మిగెల్ కంటే ముందు కె.అర్ధర్‌టన్ 40 బంతులు, ఎం.డిల్లాన్ 29 బంతులు, సి.బట్స్ 27 బంతులు, ఆర్.ఆస్టిన్ 24 బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇప్పుడు వీరందరి కంటే ఎక్కువ బంతులు ఎదుర్కొని డకౌట్ అయిన విండీస్ ఆటగాడిగా కమిన్స్ రికార్డులకెక్కాడు.
west indies
India
test match
miguel cummins

More Telugu News