Sreesanth: క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో లేని సమయంలో అగ్నిప్రమాదం... భార్యాబిడ్డలు క్షేమం!

  • అర్ధరాత్రి దాటిన తర్వాత మొదటి అంతస్తులో మంటలు
  • మంటలను అదుపు చేసిన అగ్నిమాపక దళం
  • భారీగా ఆస్తినష్టం జరిగినట్టు అంచనా!
క్రికెట్ కంటే వివాదాలతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న శ్రీశాంత్ నివాసంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కేరళలోని తిరువనంతపురం ఎడపల్లిలో ఉన్న శ్రీశాంత్ నివాసంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

ప్రమాదం జరిగిన సమయంలో శ్రీశాంత్ నివాసంలో లేడు. భార్యాబిడ్డలు నిద్రిస్తున్న సమయంలో మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం అందించడంతో సకాలంలో మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదం నుంచి శ్రీశాంత్ కుటుంబ సభ్యులు ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారు.  అయితే, గణనీయమైన స్థాయిలో ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది.

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో జీవితకాల నిషేధానికి గురైన శ్రీశాంత్ కు ఇటీవలే ఊరట లభించింది. అతడిపై నిషేధాన్ని ఏడేళ్లకు కుదించారు. ఇప్పటికే ఆరేళ్ల నిషేధం పూర్తి చేసుకున్న శ్రీశాంత్ వచ్చే ఏడాదితో విముక్తుడవుతాడు.

Sreesanth
Cricket
Kerala
Fire Accident

More Telugu News