Andhra Pradesh: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో అమరావతి రైతుల భేటీ!

  • రాజధానిని తరలించబోతున్నారని వార్తలు
  • తమ పోరాటానికి మద్దతివ్వాలని కోరిన రైతులు
  • ప్రభుత్వం ఇంకా కౌలు చెల్లించలేదని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రస్తుతం నీలినీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వం రాజధానిని తరలించబోతోందని టీడీపీ ఆరోపిస్తుండగా, తాము అలాంటి ప్రకటన ఏదీ చేయలేదని వైసీపీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పలువురు అమరావతి రైతులు ఈరోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలుసుకున్నారు.

ఈరోజు హైదరాబాద్ కు చేరుకున్న రైతులు... తమ సమస్యలపై పోరాటానికి మద్దతు ఇవ్వాలని పవన్ ను కోరారు. రాజధాని అమరావతి నుంచి మరో ప్రాంతానికి వెళ్లిపోతుందన్న వార్తలతో తామంతా తీవ్ర ఆందోళనలో ఉన్నామని రైతులు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకూ తమ భూములకు కౌలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Andhra Pradesh
Amaravati
moving
farmers
meet
Pawan Kalyan
Jana Sena

More Telugu News