Arun Jaitly: అరుణ్ జైట్లీ కన్నుమూత.. ప్రకటించిన ఎయిమ్స్!

  • ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూత
  • అనారోగ్య కారణాలతో ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న జైట్లీ
  • శోకసంద్రంలో బీజేపీ శ్రేణులు
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్, మూత్రపిండాల రుగ్మతలతో బాధపడ్డ ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మరణ వార్తతో బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి.

జైట్లీ మరణవార్తను ఎయిమ్స్ మీడియా, ప్రొటోకాల్ విభాగం అధికారికంగా ప్రకటించింది. అరుణ్ జైట్లీ తుదిశ్వాస విడిచారని ప్రకటించడానికి చింతిస్తున్నామని తెలిపింది. ఈరోజు మధ్యాహ్నం 12.07 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని వెల్లడించింది. ఈనెల 9వ తేదీని జైట్లీ ఎయిమ్స్ లో అడ్మిట్ అయ్యారని... సీనియర్ వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించిందని తెలిపింది.
Arun Jaitly
BJP

More Telugu News