గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన మాజీ స్పీకర్ కోడెల.. ఆసుపత్రికి చేరుకుంటున్న టీడీపీ నేతలు
- గత రాత్రి గుండెపోటుతో కుప్పకూలిన కోడెల
- ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో మాజీ స్పీకర్
- ఆరోపణలు, కేసులతో ఒత్తిడిలోకి..
కోడెల ఇటీవల పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన కుమారుడు, కుమార్తెపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల వ్యవహారం కొనసాగుతుండగానే అసెంబ్లీ ఫర్నిచర్ వివాదం చుట్టుముట్టింది. తాజాగా, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు మాయం చేశాడంటూ అతడి కుమారుడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ రెండు వ్యవహారాలపై విచారణ కొనసాగుతోంది. తన కుటుంబంపై వరుసపెట్టి ఆరోపణలు రావడం, కేసుల వ్యవహారంతో ఆయన తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయినట్టు తెలుస్తోంది. ఆయన గుండెపోటుకు అదే కారణమని భావిస్తున్నారు.