YV Subba Reddy: గత ప్రభుత్వ పథకాలను ఇంకా ప్రచారం చేయడంలో కుట్ర దాగివుంది: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

  • తిరుమల బస్ టికెట్లపై అన్యమత ప్రచారం వివరాలు
  • స్పందించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
  • గత ప్రభుత్వ నిర్వాకం అంటూ వ్యాఖ్యలు
తిరుమల బస్ టికెట్ల వెనుక అన్యమత ప్రచారం వివరాలు ముద్రించి ఉండడం పట్ల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. అన్యమత ప్రచారం వివరాలు ఉన్న ఆర్టీసీ టికెట్లను మార్చిలో ముద్రించారని, గత ప్రభుత్వ పథకాలను ఇంకా ప్రచారం చేస్తుండడం వెనుక కుట్ర దాగివుందని ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన ఘనకార్యాలను చెప్పుకునేందుకే ఈ టికెట్లను ముద్రించారని, అయితే ఎన్నికల కోడ్ రావడంతో ఆ టికెట్లను పక్కనపెట్టారని తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తున్నామని వైవీ వెల్లడించారు.
YV Subba Reddy
TTD
Tirumala
Tirupati
Andhra Pradesh
YSRCP
Telugudesam

More Telugu News