PV Sindhu: వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన పీవీ సింధు

  • క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీ క్రీడాకారిణిపై విజయం
  • వరల్డ్ నెం.2 తైజూ యింగ్ పై 12-21, 23-21, 21-19 తో గెలుపు
  • టైటిల్ కు రెండడుగుల దూరంలో తెలుగుతేజం
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో తెలుగుతేజం పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇటీవల మేజర్ టోర్నమెంట్లలో టైటిళ్ల కొరతతో బాధపడుతున్న సింధు... స్విట్జర్లాండ్ లోని బసెల్ లో జరుగుతున్న వరల్డ్ టోర్నీలో తన స్థాయికి తగ్గ ఆటతీరుతో ప్రత్యర్థిని అదరగొట్టింది. క్వార్టర్ ఫైనల్స్ లో చైనీస్ తైపీ షట్లర్ తైజూ యింగ్ పై ఘనవిజయం సాధించింది. 12-21, 23-21, 21-19 తో తైజూను చిత్తుచేసిన సింధు టైటిల్ కు రెండడుగుల దూరంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో సింధు స్మాష్ లకు, ప్లేస్ మెంట్లకు వరల్డ్ నెం.2 తైజూ నుంచి బదులే లేకుండా పోయింది. మొదటి గేమ్ ను ప్రత్యర్థికి సమర్పించుకున్న సింధు ఆ తర్వాత ఆటలో వేగం పెంచి వరుసగా రెండు గేములను కైవసం చేసుకోవడంతో పాటు విజయాన్ని కూడా ఒడిసిపట్టింది.
PV Sindhu
World Badminton Championship

More Telugu News