Jagan: సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాసిన కన్నా

  • కౌలు రైతుల సమస్యలపై గళమెత్తిన ఏపీ బీజేపీ చీఫ్  
  • రాజధాని రైతులకు కౌలు చెల్లించకపోవడం సరికాదంటూ హితవు
  • ఏప్రిల్, మే నెలల్లో కౌలు డబ్బులు చెల్లించలేదని వ్యాఖ్యలు
ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్ కు బహిరంగ లేఖాస్త్రం సంధించారు. రాజధాని రైతులకు కౌలు చెల్లించకపోవడం సబబు కాదని హితవు పలికారు. ఏప్రిల్, మే నెలల్లో చెల్లించాల్సిన కౌలు డబ్బులు ఇంకా ఇవ్వలేదని, కౌలు డబ్బులు రాక రైతులు అష్టకష్టాలు పడుతున్నారని కన్నా తన లేఖలో వివరించారు. రైతులకు వెంటనే కౌలు మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు.
Jagan
Kanna
BJP

More Telugu News