Kaun Banega Karodpati: ఓ సామాజికవేత్తకు పాదాభివందనం చేసిన అమితాబ్ బచ్చన్

  • కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమానికి విశిష్ట అతిథి
  • వెయ్యి మంది అనాథలకు అన్నీ తానై వ్యవహరిస్తున్న సింధూ తాయి
  • ఆమె గురించి తెలుసుకుని కదిలిపోయిన అమితాబ్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా కొనసాగుతున్న కార్యక్రమం కౌన్ బనేగా కరోడ్ పతి. ఈ కార్యక్రమం తాజా ఎపిసోడ్ లో ఓ విశిష్ట అతిథి పాల్గొన్నారు. ఆమె పేరు సింధూ తాయి సప్కల్. మహారాష్ట్రకు చెందిన సింధూ తాయి 1000 మంది అనాథలను చేరదీసి వారిని కన్నతల్లిలా చూసుకుంటోంది. కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె గురించి తెలుసుకున్న అమితాబ్ బచ్చన్ కదిలిపోయారు. ఆ మాతృమూర్తి కాళ్లకు నమస్కరించి తరించిపోయారు.

ఈ సందర్భంగా సింధూ తాయి ఓ మరాఠీ కవితను వినిపించారు. "నీ అశ్రువులతో జీవిత దర్శనం చేసుకో. ప్రతి విలాపం తర్వాత నవ్వడం అలవర్చుకో. ఎందుకంటే నేనెప్పుడూ నీతోనే ఉంటాను కదా. నేను నీకు తల్లిలాంటి దాన్ని" అంటూ సాగే ఆ కవిత అమితాబ్ ను సైతం ఆకట్టుకుంది.
Kaun Banega Karodpati
Amitabh Bachchan

More Telugu News