Jagan: అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయల్దేరిన సీఎం జగన్

షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ గత వారం రోజులుగా అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ఈ నెల 15న అమెరికా వెళ్లారు. నేటితో ఆయన పర్యటన ముగిసింది. ఈ ఉదయం (భారత కాలమానం ప్రకారం) షికాగో నుంచి హైదరాబాద్ బయల్దేరారు. ఆయన రేపు ఉదయం హైదరాబాద్ చేరుకుంటారు. జగన్ చిన్నకుమార్తె వర్షా రెడ్డి కాలేజి అడ్మిషన్ కోసం కుటుంబ సమేతంగా కలసి ముఖ్యమంత్రి అమెరికాకు వెళ్లారు. ఈ సందర్భంగా అమెరికాలో అనేక కార్యక్రమాలకు కూడా ఆయన హాజరయ్యారు. ముఖ్యంగా, ఎన్నారైలతో డల్లాస్ లో జరిగిన సమావేశానికి విశేష స్పందన లభించింది.
Go Back to Shorts
Jagan
USA
Andhra Pradesh
Hyderabad

More Telugu News