పాకిస్థాన్ కు షాక్... బ్లాక్ లిస్టులో పెట్టిన ఎఫ్ఏటీఎఫ్
- టెర్రర్ ఫైనాన్స్ కారణంగా బ్లాక్ లిస్టులో పాకిస్థాన్
- అక్టోబర్ లోగా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన పాక్
- లేని పక్షంలో క్రెడిట్ రేటింగ్ కోల్పోయే ప్రమాదం
41 మంది సభ్యుల ప్యానెల్ ను పాకిస్థాన్ తన వాదనతో ఒప్పించలేకపోయిందని వెల్లడించింది. మరోవైపు, బ్లాక్ లిస్టు నుంచి తప్పించుకోవడానికి అక్టోబరులోగా పాకిస్థాన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో అంతర్జాతీయ స్థాయిలో ఆ దేశ క్రెడిట్ రేటింగ్ పడిపోతుంది. ఆ దేశ ర్యాంకింగ్ ను ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ లు డౌన్ గ్రేడ్ చేస్తాయి.