తమిళనాడులోకి ముష్కర మూకల చొరబాటు.. నిఘా వర్గాల హెచ్చరికతో రెడ్ అలర్ట్
- శ్రీలంక మీదుగా దేశంలోకి చేరిన ఉగ్రవాదులు
- ముష్కరుల్లో ఒకరు పాకిస్థానీ, ఐదుగురు శ్రీలంక తమిళ ముస్లింలు
- రద్దీ ప్రదేశాలు, ప్రముఖులు, కార్యాలయాలే లక్ష్యం
వీరిలో ఒకరు పాకిస్థానీ కాగా, మిగిలిన ఐదుగురు శ్రీలంక తమిళ ముస్లింలుగా భావిస్తున్నారు. హిందువుల వేషధారణతో దేశంలోకి చేరి విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారని సమాచారం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను ముమ్మరం చేశారు. కోయంబత్తూర్లో హై అలర్ట్ ప్రకటించారు. నగరంలో వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. రాజధాని చెన్నైలో బలగాలను పెంచారు. ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్, బస్స్టాండ్, ఆలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. తీర ప్రాంత జిల్లాలన్నింటికీ హెచ్చరికలు జారీ చేశారు.