kodela sivaprasad: ఫర్నిచర్‌ వివరాలన్నీ నా వద్దే ఉన్నాయి... కంగారొద్దు: కోడెల శివప్రసాద్‌

  • స్వగృహంలో కంప్యూటర్ల చోరీపై వివరణ
  • ఫర్నిచర్‌ దుర్వినియోగం వార్తకు ఖండన
  • కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
కొందరు వ్యక్తులతో పాటు కొన్ని మీడియా సంస్థలు తన ఇంట్లోని ఫర్నిచర్‌ చోరీ జరిగిందని, దుర్వినియోగం అవుతోందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఏపీ శానస సభ మాజీ సభాపతి కోడెల శివప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వద్ద ఉన్న ఫర్నిచర్‌ విషయంలో ఎటువంటి కంగారు అక్కర్లేదని, ప్రతి వస్తువుకు తనవద్ద లెక్క ఉందని తెలిపారు.

ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎటువంటి తప్పు చేయలేదని ముందు నుంచీ చెబుతూ వస్తున్నానని, ఫర్నిచర్‌కు సంబంధించిన వివరాలు తన వద్ద ఉన్నాయని, వాటిని అప్పగించడమా, డబ్బు చెల్లించడమా తేల్చిచెప్పాలని కోరానని గుర్తు చేశారు. అయినా కొందరు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
kodela sivaprasad
furneture

More Telugu News