మోదీ పేరును లాగిన విజయసాయిరెడ్డిపై కేంద్ర మంత్రి అసంతృప్తి
- అన్ని విషయాలను మోదీ, అమిత్ షాలకు చెప్పే చేస్తున్నామన్న విజయసాయిరెడ్డి
- విజయసాయి వ్యాఖ్యలను ఇప్పటికే ఖండించిన ఏపీ బీజేపీ నేతలు
- మోదీ, అమిత్ షాలతో చర్చించిన తర్వాతే పోలవరంపై తదుపరి నిర్ణయం తీసుకుంటామన్న షెకావత్
మరోవైపు, విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఖండించిన విషయం కూడా షెకావత్ దృష్టికి వెళ్లింది. దీనిపై షెకావత్ కు సుజనా వివరణ ఇచ్చారు. మోదీ పేరును విజయసాయిరెడ్డి ప్రస్తావించిన తర్వాత తాను స్పందించానని తెలిపారు. అనంతరం షెకావత్ మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టుపై తదుపరి నిర్ణయం తీసుకునే ముందు మోదీ, అమిత్ షాలతో చర్చిస్తానని చెప్పారు.