Chandrababu: చంద్రబాబు కొత్తపదం కనిపెట్టారు..‘ఆర్టిఫిషియల్ ఫ్లడ్స్’ట!: మంత్రి అవంతి ఫైర్

  • అలాంటివి ఉంటే, విశాఖ, విజయనగరానికి పంపించాలి
  • అక్కడ వర్షాలు లేక చస్తున్నాం
  • చంద్రబాబు ఇల్లు ముంచడం తప్ప ప్రభుత్వానికి వేరే ఏం పని లేదా?
ఏపీలో వచ్చిన వరదలు సహజంగా సంభవించినవి కావని, కృత్రిమ వరదలను వైసీపీ ప్రభుత్వం సృష్టించిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి అవంతి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘చంద్రబాబు గారూ కొత్త పదం కనిపెట్టారు.. ‘ఆర్టిఫిషియల్ ఫ్లడ్స్’ అంట. అలాంటివి ఏవన్నా ఉంటే, విశాఖపట్టణం, విజయనగరానికి పంపించాలి. వర్షాలు లేక చస్తున్నాం. చంద్రబాబునాయుడి ఇల్లు ముంచడం, ఆర్టిఫిషియల్ ఫ్లడ్స్ క్రియేట్ చేయడం.. ప్రభుత్వానికి వేరే ఏం పనేమీ లేదా?’ అని ధ్వజమెత్తారు. ‘టీడీపీలో ఉన్న వైఫల్యాలను మొదట సరిచేసుకోండి, రెండోది, వయసు, అనుభవం రీత్యా మీరు హుందాగా వ్యవహరించండి. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండండి. ప్రతిదాన్నీ రాజకీయం చేయాలన్న ఆలోచన తగ్గించుకోండి’ అని సూచించారు.
Chandrababu
Telugudesam
YSRCP
Avanti
minister

More Telugu News