Chandrababu: మీరు చదువుకోండి, ఫీజులు మేం కడతాం అని గొప్పలు చెప్పారు... ఇప్పుడు ఫీజులు అడిగితే లాఠీలతో కొడతారా?: చంద్రబాబు

  • విజయనగరంలో విద్యార్థుల ధర్నా
  • లాఠీలు ఝుళిపించిన పోలీసులు
  • ట్విట్టర్ లో స్పందించిన చంద్రబాబు
ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్ సమస్యలపై నిరసన ప్రదర్శన చేస్తున్న విజయనగరం విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం పట్ల మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మీరు చదువుకోండి, ఫీజులు మేం కడతాం అని గొప్పలు చెప్పారు, ఇప్పుడు ఫీజులు చెల్లించాలని, స్కాలర్ షిప్ లు ఇవ్వండని అడిగితే విద్యార్థులపై లాఠీచార్జ్ చేస్తారా? అంటూ మండిపడ్డారు. ప్రభుత్వ చర్య అమానుషం అని చంద్రబాబు ట్వీట్ చేశారు. వెంటనే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని, స్కాలర్షిప్ నిధులు తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని కోరుతూ ఇవాళ విజయనగరంలో విద్యార్థులు కలెక్టరేట్ ముందు బైఠాయించడమే కాకుండా విశాఖపట్నం-రాయ్ పూర్ రహదారిని దిగ్బంధించారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీలకు పనిచెప్పారు.
Chandrababu
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News