Anil Kumar: పోలవరం ప్రాజక్టును ఏదో ఆపేస్తున్నట్టు ప్రతిపక్షాలు హడావుడి చేస్తున్నాయి: మంత్రి అనిల్ కుమార్

  • విపక్షాలపై ఏపీ మంత్రి విసుర్లు
  • పోలవరం రివర్స్ టెండరింగ్ కు హైకోర్టు బ్రేక్
  • అవినీతి బయటపడుతుందని చంద్రబాబుకు భయమంటూ అనిల్ వ్యాఖ్యలు
పోలవరం రివర్స్ టెండరింగ్ పై ముందుకెళ్లవద్దంటూ హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో పోలవరం ప్రాజక్టును ఏదో ఆపేస్తున్నట్టు విపక్షాలు హడావుడి చేస్తున్నాయని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అసహనం వ్యక్తం చేశారు. రివర్స్ టెండరింగ్ తో అవినీతి బయటపడుతుందని చంద్రబాబుకు భయం అని అన్నారు. అయినా, కోర్టు తీర్పును గౌరవిస్తామని, ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇక, వరదల్లో ఒక్క తప్పూ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి వివరించారు. ఒక్క గండి పడలేదు, ఎక్కడా ప్రాణనష్టం లేదు అని తెలిపారు.
Anil Kumar
Polavaram
Telugudesam
YSRCP
High Court

More Telugu News