Andhra Pradesh: రాజధాని మారుస్తామని, కట్టడం లేదని బొత్స చెప్పలేదు: మంత్రి కొడాలి నాని

  • రాజధానిలో ఖర్చు గురించే బొత్స ప్రస్తావించారు
  • అమరావతిపై మంత్రి వర్గంలో ఎలాంటి చర్చ జరగలేదు
  • రాజధానిపై అనవసర రాద్ధాంతం చేయొద్దు
ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు సమర్థించుకుంటున్నారు. తాజాగా, ఈ అంశంపై మంత్రి కొడాలి నాని స్పందిస్తూ, రాజధానిపై మంత్రి వర్గంలో ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. రాజధానిలో ఖర్చు గురించి మాత్రమే బొత్స ప్రస్తావించారు తప్ప, రాజధానిని మారుస్తామని, అమరావతి నిర్మాణం చేయడం లేదని ఆయన చెప్పలేదు అని అన్నారు. రాజధానిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణాల్లో జరిగిన అవినీతిపై సబ్ కమిటీ వేశామని, దోచుకున్న వాళ్లు శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు.
Andhra Pradesh
Amaravathi
Minister
Kodali Nani

More Telugu News