MK Stalin: గోడ దూకి వెళ్లి చిదంబరాన్ని అరెస్ట్ చేయడం దేశానికే సిగ్గుచేటు: స్టాలిన్

షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను సీబీఐ అధికారులు నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేయడంపై భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. దీనిపై డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. సీబీఐ అధికారులు గోడ దూకి చిదంబరం నివాసంలోకి వెళ్లడాన్ని తాను కూడా చూశానని, ఇలా వ్యవహరించడం దేశానికే సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. చిదంబరం ముందస్తు బెయిల్ కోసం విజ్ఞప్తి చేసినా ఆయనను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంను అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు కొద్దిసేపటి క్రితమే కోర్టుకు తరలించారు.
Go Back to Shorts
MK Stalin
Chidambaram
INX Media
CBI

More Telugu News