polavaram: ‘పోలవరం’పై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది: దేవినేని ఉమ

  • రివర్స్ టెండరింగ్ పై ఎవరెన్ని చెప్పినా లెక్కపెట్టలేదు
  • జగన్ సర్కార్ అహంకారంతో వ్యవహరించింది
  • మా హయాంలో ‘పోలవరం’ పూర్తికి తపించాం
పోలవరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రివర్స్ టెండరింగ్ పై ఎవరెన్ని చెప్పినా లెక్కపెట్టలేదని మండిపడ్డారు. జగన్ తన అనుచరులకు విద్యుత్ ప్రాజెక్టు ఇప్పించేందుకే పోలవరం టెండర్లను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ కు వెళ్లారని ఆరోపించారు. అహంకారంతో వ్యవహరించిన జగన్ సర్కార్ కు హైకోర్టు తీర్పు చెంపపెట్టుగా అభివర్ణించారు. పోలవరం ప్రాజెక్టుకు పునాదే పడలేదని జగన్ విమర్శించారని, ఎక్కడైతే పునాది పడలేదని అన్నారో అక్కడి నుంచే లక్షలాది క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్లిందని అన్నారు. టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని తపిస్తే, తమపై వైసీపీ నేతలు అవినీతి ముద్ర వేశారని ధ్వజమెత్తారు.
polavaram
project
High Court
Telugudesam
Devineni

More Telugu News