Jagan: ప్రభుత్వానికి పిచ్చి అనుకోవాలా? రాష్ట్రానికి పట్టిన శని అనుకోవాలా?: చంద్రబాబు

  • జగన్ మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు
  • రీటెండరింగ్ వల్ల పోలవరంకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది
  • పోలవరంతో ప్రయోగాలు వద్దని మేము ముందు నుంచీ చెబుతున్నాం
పోలవరం ప్రాజెక్టు రీటెండరింగ్ పై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మూర్ఖంగా జగన్ నిర్ణయాలను తీసుకుంటున్నారని విమర్శించారు. పోలవరం రీటెండరింగ్ వల్ల ప్రాజెక్టుకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతున్నా వైసీపీ ప్రభుత్వానికి అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. పోలవరంలో లేని అనినీతిని నిరూపించాలనే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.

టెండర్లను రద్దు చేసే ఆలోచనను విరమించుకోవాలని కేంద్ర మంత్రి గడ్కరీ కూడా ఎన్నో సార్లు చెప్పారని చంద్రబాబు అన్నారు. ఒకసారి న్యాయ వివాదం మొదలైతే... ప్రాజెక్టు నిర్మాణంపై తీవ్ర ప్రభావం పడుతుందని, తీవ్ర జాప్యం జరుగుతుందని చెప్పారు. పోలవరంతో ప్రయోగాలు వద్దని తాము ముందు నుంచి చెబుతున్నామని అన్నారు. ప్రభుత్వానికి పిచ్చి అనుకోవాలా? లేక రాష్ట్రానికి పట్టిన శని అనుకోవాలా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Jagan
Chandrababu
Polavaram
High Court
Telugudesam
YSRCP

More Telugu News